Telangana: తెలంగాణలోని 16 లోక్ సభ స్థానాల్లో మేం టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తాం!: మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

  • ఒవైసీతో చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి భేటీ
  • తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన మజ్లిస్ అధినేత

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 16 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి మద్దతు ఇస్తామని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న టీఆర్ఎస్ నేత జి.రంజిత్ రెడ్డి ఈరోజు ఒవైసీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందుకు ఒవైసీ సానుకూలంగా స్పందించారు. చేవెళ్లలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. మజ్లిస్ అధినేత ఒవైసీ హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

Telangana
loksabha
MIM
TRS
16 loksabha seats
Twitter
  • Loading...

More Telugu News