Andhra Pradesh: ఆంధ్రాలో అందిన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవే!: ఏపీ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన
- ఏపీలో 1.41 ఓట్లను తొలగించాం
- ప్రస్తుతం 3.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు
- ఈ సంఖ్య 3.93 కోట్లకు పెరగవచ్చు
ఆంధ్రప్రదేశ్ లో ఓట్లను తొలగించాలని దాఖలైన దరఖాస్తుల్లో 85 శాతం నకిలీ దరఖాస్తులేనని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్లను తొలగించాలని తమకు 9.5 లక్షల ఫామ్-7 దరఖాస్తులు అందాయని వెల్లడించింది. వాటిలో కేవలం 1.41 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించామనీ, నకిలీ ఓట్లను తొలగించామని పేర్కొంది. వీటిలో సగం ఓట్లు గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలలోనే ఉన్నాయని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఏపీలో 3.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 3.93 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. త్వరలోనే తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది.