bode prasad: గత ఎన్నికల కంటే ఈసారి విశేష స్పందన కనిపిస్తోంది: బోడె ప్రసాద్

  • టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉంది
  • చంద్రబాబు పథకాలు టీడీపీని గెలిపిస్తాయి
  • నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతా

2014 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు మరోసారి టికెట్ రావడంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని చెప్పారు. గత ఎన్నికల కంటే ఈసారి విశేష స్పందన కనిపిస్తోందని... ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలే టీడీపీకి విజయాన్ని కట్టబెడతాయని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 42 గ్రామాల్లో 90 శాతం అభివృద్ధి చేశానని తెలిపారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతానని, చిన్నచిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగుతానని చెప్పారు.

bode prasad
penamaluru
Telugudesam
  • Loading...

More Telugu News