Andhra Pradesh: హైదరాబాద్ బ్రాండ్ చెడగొడుతూ ప్రతీఒక్కరూ ఛీకొట్టే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు!: సీఎం చంద్రబాబు

  • ఏపీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారు
  • ఇలాంటి కుట్రలను చూస్తూ ఊరుకోబోం
  • అమరావతిలో టీడీపీ అధినేత టెలీకాన్ఫరెన్స్

జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి కుట్రలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ డిక్టేటర్ గా తయారు అయ్యారనీ, జగన్ ద్వారా ఆంధ్రాను డిక్టేట్ చేయడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేసుల కోసం జగన్ ఆంధ్రాను కేంద్రానికి అమ్మేస్తారన్న భావన ప్రజల్లో బలపడుతోందని వ్యాఖ్యానించారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ను చెడగొడుతూ ప్రతీఒక్కరూ ఛీకొట్టే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆస్తులపై కేసీఆర్ కన్నేయడం టీడీపీ ఏకపక్ష విజయానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్ ఏపీపై పెత్తనం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. వీరందరికీ ఓటుతో గట్టి గుణపాఠం చెబుతారన్నారు.

Andhra Pradesh
Telangana
Telugudesam
Hyderabad
Chandrababu
YSRCP
Jagan
KCR
  • Loading...

More Telugu News