Tirupati: తిరుపతి బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ ఎన్.గౌతంకు గుండెపోటు.. హైదరాబాద్‌కు తరలింపు

  • మాజీ ఎంపీ వెంకటస్వామి కుమారుడే గౌతం
  • ఆరేళ్ల సర్వీసును వదులుకుని రాజకీయాల్లోకి 
  • ఎన్నికల్లో పోటీ చేయబోరన్న కుటుంబ సభ్యులు

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ ఎన్.గౌతం శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. తిరుపతి మాజీ ఎంపీ వెంకటస్వామి కుమారుడైన గౌతం హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆరేళ్ల సర్వీసును వదులుకున్న డాక్టర్ గౌతం ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే, హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో ఆయన ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Tirupati
Doctor N.Goutam
BSP
Jana Sena
CPI
Heart attack
Andhra Pradesh
  • Loading...

More Telugu News