Telangana: మరోసారి అవకాశమిస్తే ఇదే స్పూర్తితో పనిచేస్తా: నామినేషన్ అనంతరం ఎంపీ కవిత

  • నియోజకవర్గ అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేశా
  • పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలి
  • మన హక్కులను కాపాడుకుందాం

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కవిత ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని కవిత తన ట్వీట్ లో తెలిపారు. ‘ఈ సందర్భంగా మరోసారి మీ అందరి ఆశీస్సులు కోరుతున్నా. గతంలో మీ అందరి సహకారంతో ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేశాను. మరోసారి అవకాశం కల్పిస్తే ఇదే స్పూర్తితో పనిచేస్తాను' అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుంచి పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిస్తేనే, మన హక్కులను కాపాడుకోగల్గుతామని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి పోరాడారని, తమ ఎంపీ అభ్యర్థులందరిని దీవించి, గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Telangana
nizamabad
mp
kavitha
nominations
  • Loading...

More Telugu News