Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ లో నిరసన సెగ.. రఘువీరారెడ్డితో సుంకర కృష్ణమూర్తి వాగ్వాదం

  • కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటూ ఇవ్వలేదు
  • కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం లేదు
  • సీట్లు అమ్ముకుంటున్నారని సుంకర ఆరోపణలు

ఏపీ కాంగ్రెస్ లో నిరసన సెగలు మొదలయ్యాయి. నిన్న వెలువడ్డ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటూ కేటాయించలేదని ఆ పార్టీ సీనియర్ నేత సుంకర కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రఘువీరారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ కార్యకర్తలు సుంకర కృష్ణమూర్తిని బయటకు నెట్టేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని, సీట్లు అమ్ముకుంటున్నారని సుంకర కృష్ణమూర్తి ఆరోపించడం గమనార్హం. రఘువీరారెడ్డిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
congress
Raghuveera reddy
sunkara
krishna murthy
Vijayawada
  • Loading...

More Telugu News