ram gopal varma: నా బయోపిక్ తీస్తే... సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కూడా రాదు: రామ్ గోపాల్ వర్మ

  • నా జీవితంలో చీకటి కోణాలు ఉన్నాయి
  • చీకటి కూడా ఉంది
  • వైయస్, కేసీఆర్ బయోపిక్ లు తీస్తా

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ఏపీలో ఎన్నికల వేడిని రామ్ గోపాల్ వర్మ మరింత పెంచారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఓ టీవీ ఛానల్ తో వర్మ మాట్లాడుతూ, తాను మరో రెండు బయోపిక్ లను నిర్మించనున్నట్టు తెలిపారు. ఒకటి వైయస్సార్, రెండోది కేసీఆర్ బయోపిక్ అని వెల్లడించారు. ఇదే సమయంలో సొంత బయోపిక్ తెరకెక్కించే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా... తన బయోపిక్ ను తీస్తే, సెన్సార్ క్లియరెన్స్ రాదని చెప్పారు. తన జీవితంలో చీకటి కోణాలతో పాటు, చీకటి కూడా ఉంటుందని తెలిపారు.

ram gopal varma
biopic
tollywood
  • Loading...

More Telugu News