: ఇక ఇంట్లోనే కోకకోలా చేయొచ్చు...?!


మీ ఇంటికి అతిధులు ఎవరైనా వస్తే వెంటనే బజారుకెళ్లి కూల్‌డ్రింక్స్ తెప్పించి ఇస్తారుకదా... అలాంటి కూల్‌డ్రింక్‌ అచ్చంగా మీ ఇంట్లోనే చేసుకొంటే... భలేవుంటుంది కదూ...! అయితే కోకకోలాని మీకు మీరే తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం క్లిఫ్‌క్లగ్‌ దగ్గర దీని తయారీ విధానాన్ని వేలంలో కొనుక్కోండి. కోకకోలా తయారీ ప్రక్రియ 1943లో మొదలయింది. దీన్ని రుచి చూసిన చాలామంది దీన్ని తయారు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అయితే దీని తయారీ విధానం గురించిన రహస్యం తనవద్ద ఉందని, దీన్ని ఎవరైనా కావాలంటే కొనుక్కొండహో అంటూ ఇంటర్నెట్‌లో పెట్టేశాడు.

కోకకోలా తయారీ విధానం అమెరికాలోని అట్లాంటాలో వున్న 'వరల్డ్‌ ఆఫ్‌ కోకకోలా'లో ఒక లాకర్‌లో వుంది. ఈ విషయం కంపెనీలోని అతి ముఖ్యులైన కొద్దిమందికి తప్ప, ఆ లాకర్‌లో ఏముందో ఎవరికీ తెలియదు. అయితే అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన క్లిఫ్‌క్లగ్‌ మాత్రం తాను ఇటీవలే కొన్ని పాత ఉత్తరాలను, రాతప్రతులను ఒక ఎస్టేట్‌నుండి కొన్నానని, వాటిలో కోకకోలా తయారీ విధానం గురించి ఉన్న పత్రం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఆయన చెప్పేదంతా వట్టిదేనని కోకకోలా అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News