ramgopal varma: వర్మ నుంచి వైఎస్ఆర్ బయోపిక్ .. 'రెడ్డిగారు పోయారు'

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో ఆగిపోను 
  • వైఎస్ఆర్ మరణంతో కథ మొదలవుతుంది
  •  కేసీఆర్ బయోపిక్ పై రీసెర్చ్ వర్క్ మొదలుపెడతాను

రామ్ గోపాల్ వర్మ ఎవరి గురించైనా సరే తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్భయంగా .. నిర్మొహమాటంగా చెప్పేస్తారు. బయోపిక్ లను తెరపై ఆవిష్కరించే విషయంలోనూ ఆయన తన పద్ధతిని మార్చుకోరు. అలా మార్చుకుంటే అది బయోపిక్ ఎలా అవుతుందని ఆయన ఎదురు ప్రశ్నిస్తారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో అంతా తన గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసిన ఆయన, తాజా ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' బయోపిక్ తోనే నేను ఆగిపోను. వైఎస్ఆర్ .. కేసీఆర్ బయోపిక్ లను కూడా తెరపైకి తీసుకొస్తానని ఆయన అన్నారు. వైఎస్ఆర్ బయోపిక్ కి 'రెడ్డిగారు పోయారు' అనే టైటిల్ ను ఖరారు చేసేశాను. వైఎస్ఆర్ మరణంతో ఈ కథ మొదలవుతుంది. తన మరణం తరువాత కూడా రాజకీయాలను ప్రభావితం చేసిన ఆయన నేపథ్యం ఏమిటి? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని చెప్పారు. ఇక కేసీఆర్ బయోపిక్ కి సంబంధించిన రీసెర్చ్ వర్క్ ఇంకా మొదలుకాలేదు .. త్వరలోనే మొదలుపెడతాను" అని ఆయన చెప్పుకొచ్చారు. 

ramgopal varma
  • Loading...

More Telugu News