Mohan Babu: చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగనున్న నటుడు మోహన్ బాబు... హౌస్ అరెస్ట్ చేసే అవకాశం!

  • ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాల నిర్లక్ష్యం
  • నేడు విద్యార్థులతో భారీ ర్యాలీ
  • నిరసనలకు అనుమతి లేదంటున్న పోలీసులు

ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, ఎన్నో విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ, నటుడు, పలు స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్న మోహన్ బాబు, ఈ ఉదయం భారీ ఎత్తున నిరసనలకు దిగాలని నిర్ణయించుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

 ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, నిరసనలకు అనుమతులు లేకపోవడంతో ఆయన్ను ఇల్లు దాటకుండా హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తమ కాలేజీ విద్యార్థులతో పాటు, ఇతర కాలేజీ విద్యార్థులతో ఫీజు బకాయిల చెల్లింపుపై ఆయన భారీ ర్యాలీ నిర్వహించేందుకు రెండు రోజుల క్రితం నిర్ణయించారు. దీంతో పాటు ధర్నా చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తిరుపతి సమీపంలోని రంగంపేటలో ఉన్న శ్రీవిద్యా నికేతన్ కు భారీ ఎత్తున చేరుకున్నారు. ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే, ఆయన్ను హెచ్చరిస్తామని, వినకుంటే అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.

Mohan Babu
House Arrest
Rally
Fee Reembarsment
Students
Tirupati
  • Loading...

More Telugu News