Jagan: ఇవాళ జగన్ నామినేషన్ కు సర్వం సిద్ధం... పులివెందులలో కోలాహలం

  • మొదట భారీ బహిరంగ సభ
  • ఆ తర్వాతే నామినేషన్
  • 9 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్ మొదట భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందులలో రిటర్నింగ్ అధికారికి మధ్యాహ్నం 1.40 నుంచి 1.49 నిమిషాల మధ్యలో జగన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. జగన్ నామినేషన్ నేపథ్యంలో పులివెందులలో భారీగా కోలాహలం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News