Andhra Pradesh: అవును, ఒంగోలు సీటు ఆశించాను: స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

  • సుబ్బారెడ్డి జగన్ పై అలిగారని వార్తలు
  • అందుకే విదేశాలకు వెళ్లారని కథనాలు
  • ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన జగన్ చిన్నాన్న

వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అలిగారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒంగోలు లోక్ సభ స్థానాన్ని తనకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వడంపై ఆయన మనస్తాపం చెందారనీ, అందుకే విదేశాలకు వెళ్లిపోయారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లానని సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రస్తుతం తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తాను ఒంగోలు లోక్ సభ సీటును ఆశించానని, అయితే మాగుంటకు టికెట్ ఇవ్వడం పార్టీ నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ చెప్పారనీ, అయితే ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని వెల్లడించారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలు అంటేనే ఆసక్తి అని వ్యాఖ్యానించారు. తాను ఇన్‌ఛార్జిగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Andhra Pradesh
YSRCP
ongole
loksabha seat
magunta
YV Subba Reddy
Jagan
  • Loading...

More Telugu News