Chandrababu: చంద్రబాబుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. 34 మందిపై ఫిర్యాదు

  • అసభ్య పదజాలంతో చంద్రబాబుపై పోస్టులు
  • మొత్తం 34 మందిపై ఫిర్యాదు
  • సైబర్ క్రైం కింద కఠినంగా శిక్షించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న 34 మందిపై రాయచోటి టీడీపీ నియోజకవర్గ కార్యదర్శి అంజద్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ బాషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్‌రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో చంద్రబాబుపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్టులు పెడుతున్నాడని, వాటిని లోకేశ్ అనే వ్యక్తి షేర్ చేసి సాయం చేస్తున్నాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 34 మందికి ఇందులో పాత్ర ఉందని ఫిర్యాదు చేశారు. వారందరిపైనా సైబర్ క్రైం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  

Chandrababu
Social Media
Facebook
Fake news
cyber crime
Kadapa District
Telugudesam
  • Loading...

More Telugu News