Radhika Apte: ఆ అబ్బాయి నాతో డ్యూయెట్లు పాడితే బాగుండునని ఊహించుకునేదాన్ని: రాధికా ఆప్టే

  • ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను
  • కలలోకి వస్తాడని త్వరగా నిద్రపోయేదాన్ని
  • నన్ను నేను హీరోయిన్‌లా ఊహించుకునేదాన్ని

మహిళలు తాము కనే కలల గురించి సంకోచం లేకుండా బయటకు చెప్పినప్పుడే మానసికంగా, శారీరకంగా ఎలా ఉన్నారనే విషయాలు తెలుస్తాయని సినీ నటి రాధికా ఆప్టే అభిప్రాయపడింది. తాజాగా ఆమె ‘ఓ మై హృతిక్’ అనే కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకుంది. తాను చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని, అతను కలలోకి వస్తాడని త్వరగా నిద్ర పోయేదాన్నని వివరించింది. సినిమాలు చూస్తూ తనను తాను హీరోయిన్‌లా భావించేదానన్ని తెలిపింది.

‘నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా ఇంట్లో ఓ పని మనిషి ఉండేది. తను ఎక్కువగా సినిమాలు చూసేది. నేను కూడా తనతో పాటే సినిమాలు చూసేదాన్ని. కొన్ని పాటల్లో వర్షం పడుతున్నప్పుడు హీరోయిన్‌ చీరకొంగు గాలికి ఎగరడం, ఆ తర్వాత హీరో వచ్చి ఆమెతో పాటలు పాడుతూ చిందులేయడం ఎక్కువగా ఉండేవి. నేను కూడా నన్నో హీరోయిన్‌లా ఊహించుకునేదాన్ని. మా క్లాస్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నేను కూడా చీరకట్టుకుని వర్షంలో తడుస్తున్నప్పుడు అతను నాతో డ్యూయెట్లు పాడితే బాగుండునని ఊహించుకునేదాన్ని. అది ఎప్పుడూ జరగలేదు. అందుకే కనీసం కలలో అయినా నేను అనుకున్నది జరగాలని అతని కోసమే త్వరగా నిద్రపోయేదాన్ని’ అని రాధిక చెప్పుకొచ్చింది.

Radhika Apte
Heroine
Duets
Media
Oh my Hruthik
  • Loading...

More Telugu News