YSRCP: వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ మూడూ ఒకే తాను ముక్కలు: కోట్ల

  • వైసీపీ డబ్బుల పార్టీ
  • తిక్కారెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం
  • టీడీపీ నేతలను కాపాడుకునే శక్తి ఉంది

వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ మూడూ ఒకే తాను ముక్కలనీ.. వైసీపీకి ఓటేస్తే బతుకులు నాశనమవుతాయని టీడీపీ నేత, మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ డబ్బుల పార్టీ అని విమర్శించారు. వైసీపీ చేస్తున్న దాడులకు భయపడేది లేదని, అలాగని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. టీడీపీ నేతలను కాపాడుకునే శక్తి తమకు ఉందని, బాధ్యత కూడా తమదేనని కోట్ల తెలిపారు.

YSRCP
BJP
TRS
Telugudesam
Kotla Suryaprakash Reddy
Tikka Reddy
  • Loading...

More Telugu News