Andhra Pradesh: చంద్రబాబు ‘చీఫ్ మినిస్టర్’ కాదు ‘క్రిమినల్ మినిస్టర్‘: జగన్ తీవ్ర వ్యాఖ్యలు

  • చంద్రబాబు పాలనలో ‘సీఎం’ అర్థం మారింది 
  • జన్మభూమి కమిటీల మాఫియా నడుస్తోంది
  • ఏపీలో మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి బాబు

ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా రాష్ట్రానికి పెద్దదిక్కుగా వ్యవహరించారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో జన్మభూమి కమిటీల మాఫియా నడుస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘సీఎం అనే రెండక్షరాలకు చంద్రబాబు నాయుడుగారి పాలనలో దాని అర్థమేంటంటే.. ‘సీఎం’ అంటే చీఫ్ మినిస్టర్ కాదు ‘క్రిమినల్ మినిస్టర్’’ అని అభివర్ణించారు. వైఎస్ వివేకా నందరెడ్డి మీ అందరికీ పరిచయమున్న వ్యక్తి. మా చిన్నాన్నను మేము పోగొట్టుకున్నాం. మా చిన్నాన్నను చంపించిన వారెవరంటే చంద్రబాబునాయుడుగారు... మా చిన్నాన్నను చంపించింది వీరే, మళ్లీ, ఎంక్వయిరీ చేసేది వీళ్ల పోలీసులే. వీళ్లు ఎలా చెబితే అలా రాసేది, చూపించేంది వీళ్ల పేపర్లే, టీవీ ఛానెల్సే. ఇంకా న్యాయం ఏం జరుగుతుందో చంద్రబాబునాయుడు చెప్పాలి?’ అని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
Chittoor District
palamaneru
Telugudesam
YSRCP
Jagan
cm
Chandrababu
ys
viveka
  • Loading...

More Telugu News