palamuru district: గులాబీ గూటికి కొల్లాపూర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే?... కేసీఆర్‌తో సుదీర్ఘంగా మంతనాలు!

  • వరుస షాక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌
  • పాలమూరు జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే 
  • మహబూబ్‌నగర్‌లో ఇక హస్తం ఖాళీ

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే పార్టీ వీడుతుండడంతో అధిష్ఠానానికి దిక్కుతోచడం లేదు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కారెక్కిపోగా తాజాగా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న చర్చ సాగుతోంది. పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుంటే కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం ఇది. హర్షవర్థన్‌రెడ్డి ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి సీఎం కేసీఆర్‌తో ఏకాంతంగా సుదీర్ఘ సమయం చర్చలు జరపడంతో ఆయన టీఅర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే నిజమైతే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్టే!

palamuru district
kollapur
MLA harshavardhan
TRS
  • Loading...

More Telugu News