Mamata banerjee: ఓ.. ఎగిరిపడుతున్నారుగా.. దమ్ముంటే నాతో మంత్రాలు చదవండి: మోదీ, షాలకు మమత సవాల్

  • మమత మతాన్ని ప్రశ్నించిన బీజేపీ
  • పూజ చేయడమంటే నుదిటికి తిలకం దిద్దుకోవడం కాదు
  • మతం, మందిరం పేరుతో రాజకీయం చేయడం మాత్రమే బీజేపీకి తెలుసు

ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సవాలు విసిరారు. పూజలు చేయడమంటే నుదిటికి తిలకం దిద్దుకోవడం కాదని, దమ్ముంటే తనతో మంత్రాలు చదవడానికి రావాలని సవాల్ చేశారు. బీజేపీ నేతలు తన మతాన్ని ప్రశ్నించడంపై మండిపడిన మమత ఈ సవాలు విసిరారు.

‘‘పూజ అంటే నుదిటికి తిలకం దిద్దుకోవడం కాదు. మంత్రాల అర్థాలను పూర్తిగా తెలుసుకోవాలి. మోదీ-షా ద్వయాన్ని నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నాతో మంత్రాలు చదవడానికి రావాలి’’ అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. తన మతం గురించి లెక్చర్లు అవసరం లేదని, మానవత్వమే తన మతమని తేల్చిచెప్పారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నో ఆలయాలను తమ ప్రభుత్వం పునరుద్ధరించినట్టు మమత తెలిపారు. మతం, మందిరం పేరుతో రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసని మమత మండిపడ్డారు. వారికి రామ మందిరం నిర్మించడం చేతకాదని మమత ఆరోపించారు.

Mamata banerjee
West Bengal
BJP
Worship
Narendra Modi
Amit Shah
  • Loading...

More Telugu News