Kurnool District: కోడుమూరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ కలెక్టర్ బి.రామాంజనేయులు

  • మంత్రి నారా లోకేశ్‌తో రామాంజనేయులకు సన్నిహిత సంబంధాలు
  • కర్నూలు సభలో రామాంజనేయులును పరిచయం చేసిన చంద్రబాబు
  • గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన రామాంజనేయులు కుమార్తె

గుంటూరు మాజీ కలెక్టర్ బి.రామాంజనేయులు ఎన్నికల బరిలో దిగారు. టీడీపీ టికెట్‌పై కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి పోటీ చేస్తున్న ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిజానికి ఆయన తాడికొండ, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాలు, బాపట్ల, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని భావించారు. అయితే, టీడీపీ అధిష్ఠానం ఆయనకు కోడుమూరు టికెట్‌ను కేటాయించింది. రామాంజనేయులు సొంత జిల్లా కర్నూలు కావడం గమనార్హం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయనకు కోడుమూరు టికెట్‌ను కేటాయించారు. మంగళవారం కర్నూలులో నిర్వహించిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. రామాంజనేయులును పరిచయం చేశారు.

మంత్రి నారా లోకేశ్‌తో రామాంజనేయులుకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2009 నుంచి 2012 వరకు ఆయన గుంటూరు కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజనానంతరం  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కుమార్తె చింతలపూడి నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 

Kurnool District
Kodumuru
Guntur District
Telugudesam
Andhra Pradesh
B.Ramanjaneyulu
  • Loading...

More Telugu News