Chandrababu: నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బైరెడ్డి.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్య కూడా!

  • మరి కాసేపట్లో చంద్రబాబును కలవనున్న బైరెడ్డి, ఐజయ్య
  • నందికొట్కూరు టికెట్‌ విషయంలో ఐజయ్యకు జగన్ మొండిచేయి
  • ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి జయరాజ్

రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి మరికాసేపట్లో ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకోనున్నారు. అనంతరం ఆయన సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతోపాటు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య కూడా పసుపు కండువా కప్పుకోనున్నారు. గత ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి విజయం సాధించిన ఐజయ్యకు ఈసారి వైసీపీ అధినేత జగన్ మొండి చేయి చూపించారు.

నందికొట్కూరు టికెట్‌ను తనకు కాదని అర్ధర్‌కు కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐజయ్య పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నేడు బైరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అయితే, నందికొట్కూరు టికెట్‌ను టీడీపీ ఇప్పటికే బండి జయరాజుకు కేటాయించిన నేపథ్యంలో ఐజయ్య పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.  

Chandrababu
Telugudesam
byreddy rajasekhar reddy
Kurnool District
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News