Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పాటిల్ కుటుంబం

  • అనంతపురంలో జరిగిన సీఎం ఎన్నికల సభలో టీడీపీ తీర్థం
  • పాటిల్ కుటుంబంతోపాటు పదుల సంఖ్యలో పార్టీలో చేరిన నేతలు
  • చంద్రబాబును మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యమన్న మంత్రి కాల్వ

టీడీపీలో చేరనున్నట్టు ఇటీవల ప్రకటించిన సీనియర్ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబం చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంది. అనంతపురంలో మంగళవారం జరిగిన సీఎం ఎన్నికల ప్రచారసభలో మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు సమక్షంలో పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, ఆయన సోదరుడు సదాశివరెడ్డి, తనయుడు అజయ్‌కుమార్‌ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితోపాటు పదుల సంఖ్యలో నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  

Chandrababu
Telugudesam
Patil Venugopal Reddy
Anantapur District
Andhra Pradesh
  • Loading...

More Telugu News