Sabbam Hari: చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అవన్నీ సాధ్యం: సబ్బం హరి

  • భీమిలిలో గెలిచి ఉడతాభక్తి చాటుకుంటా
  • మేయర్‌గా నేను చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదు
  • ప్రత్యర్థుల ధన ప్రలోభాలు ఇక్కడ పనిచేయవు

విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సబ్బం హరి నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. మంగళవారం సీఎంతో భేటీ అయిన హరి తాజా  రాజకీయాలపై చర్చించారు. అనంతరం హరి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాజధాని, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు.

భీమిలి సీటును గెలిచి టీడీపీకి ఉడతాభక్తిగా తోడ్పడతానన్నారు. భీమిలిలో టీడీపీ బలంగా ఉందని, నేతలు పార్టీలు మారినా కేడర్ చెక్కు చెదరలేదని అన్నారు. మేయర్‌గా తాను చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని, ఇక్కడ ప్రత్యర్థుల ధన ప్రవాహం ఎంతమాత్రమూ పనిచేయదని అన్నారు. ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌ను సబ్బం హరి ఎదుర్కోనున్నారు.

Sabbam Hari
Telugudesam
Bheemili
Chandrababu
Visakhapatnam District
  • Loading...

More Telugu News