cuddapah: మీ జిల్లాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడెలాంటి వాడో మీరే అర్థం చేసుకోవాలి!: కడపలో చంద్రబాబునాయుడు

  • జగన్ వి అన్నీ  డ్రామాలే
  • కడప జిల్లాకు ఏదైనా కావాలని ఎప్పుడైనా అడిగారా?
  • వైఎస్ వివేకాను ఇంట్లోనే చంపేశారు

‘మీ జిల్లాలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఎలాంటి వాడో మీరే అర్థం చేసుకోవాలి!’ అని కడపలో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో జగన్ పై సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో కడప జిల్లాను ఓ పారిశ్రామిక కేంద్రంగా, హార్టీ కల్చర్ హబ్ గా, టూరిజం కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

కడపకు సంక్షేమం, అభివృద్ధి విషయంలో తాను ఎక్కడా తక్కువ చేయలేదని, వచ్చిన బాధల్లా ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగనేనని, ఆయనవన్నీ డ్రామాలేనని విరుచుకుపడ్డారు. కడపకు ఉక్కు పరిశ్రమ గురించి జగన్ ఏ నాడైనా మాట్లాడారా? కడప జిల్లాకు ఏదైనా కావాలని జగన్ ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకాను ఇంట్లోనే చంపేశారని, హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్టుగా ఎందుకు చిత్రీకరించారని ప్రశ్నించారు. వివేకాకు బ్లడ్ వామ్ టింగ్స్ అని నమ్మించారని, సాక్షి ఛానెల్ లో ప్రచారం చేశారని, ‘ఇదొక టీవీయా? పనికిమాలిన టీవీ?’ రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు.

cuddapah
Telugudesam
Chandrababu
YSRCP
jagan
  • Loading...

More Telugu News