AP: ‘జనసేన’నుంచి మరో జాబితా విడుదల.. విశాఖ లోక్ సభ అభ్యర్థిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • ఒక లోక్ సభ, 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • విశాఖపట్టణం (ఉత్తరం)- పసుపులేటి ఉషా కిరణ్
  • విశాఖపట్టణం (దక్షిణం)- గంపల గిరిధర్  

‘జనసేన’ తరపున అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న మరికొంత మంది అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఒక లోక్ సభ స్థానానికి, 8 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తోడల్లుడు రాజగోపాల్ ను జనసేన పార్టీలో ఉన్నతమైన ఒక కమిటీకి చైర్మన్ గా నియమించనున్నట్టు ప్రకటించారు.  

విశాఖపట్టణం లోక్ సభ అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేరును ఆయన ప్రకటించారు.

శాసనసభ అభ్యర్థుల విషయానికొస్తే..

విశాఖపట్టణం (ఉత్తరం)- పసుపులేటి ఉషా కిరణ్
విశాఖపట్టణం (దక్షిణం)- గంపల గిరిధర్
విశాఖపట్టణం (తూర్పు)- కోన తాతారావు
భీమిలి- పంచకర్ల సందీప్
అమలాపురం- శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం- తుమ్మల రామస్వామి (బాబు)
పోలవరం- చిర్రి బాలరాజు
అనంతపురం- టీసీ వరుణ్  

AP
visaka
MP
cbi ec Jd
Lakshmi narayana
  • Loading...

More Telugu News