paruchuri: ఏడాదికి నాలుగు సినిమాలు చేయమని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాను: పరుచూరి గోపాలకృష్ణ
- 'నరసింహుడు' టైమ్ లో అలా జరిగింది
- ఎన్టీఆర్ తో అలా చెప్పాను
- అప్పట్లో హీరోలు అలాగే చేశారు
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో, యంగ్ ఎన్టీఆర్ గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడారు. "ఇటీవల ఒక ఛానల్లో .. యువ కథానాయకులు వరుస సినిమాలు చేస్తూ .. ఒక ఏడాదిలో స్టార్ హీరోలకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అనే న్యూస్ చూశాను. అప్పుడు 2005లో నాకు .. ఎన్టీఆర్ కి మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తుకొచ్చింది.
చిన్న ఎన్టీఆర్ హీరోగా చేసిన 'నరసింహుడు' సినిమా రిలీజ్ సమయంలో ఆ నిర్మాత ట్యాంక్ బండ్ పై నుంచి దూకేయడం జరిగింది. ఆ సమయంలో నేను ఎన్టీఆర్ ను కలుసుకున్నాను. ఏడాదిన్నర .. రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నావు. అలా కాకుండా ఇప్పుడు తీసుకుంటున్న దాంట్లో నాలుగోవంతు తీసుకుంటూ .. ఏడాదికి నాలుగు సినిమాలు చేయమని చెప్పాను.
తాతగారి నిర్మాతలంతా సిద్ధంగానే వున్నారని అన్నాను. మొదటివారానికే డబ్బులు వచ్చేస్తాయి .. నష్టాలనేవి వుండవు అని చెప్పాను. అప్పుడు ఎన్టీఆర్ నవ్వేసి .. పోటీ యుగంలో తప్పదు పెదనాన్న అనేశాడు. కానీ వరుసగా సినిమాలు చేయడం వలన .. ఒక సినిమా పోయినా మరో సినిమా ఆడేస్తూ వుంటుంది. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు అలాగే చేశారు" అని ఆయన చెప్పుకొచ్చారు.