Kurnool District: కర్నూల్‌ జిల్లాలో వైసీపీకి మరో షాక్‌?...సైకిలెక్కేందుకు సిద్ధమవుత్ను ఎమ్మెల్యే ఐజయ్య

  • సిట్టింగ్‌ స్థానం దక్కక పోవడంతో అసంతృప్తి
  • తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు
  • త్వరలోనే వైసీపీని వీడనున్నారని సమాచారం

కర్నూల్‌ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలేలా ఉంది. ఆ పార్టీ నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎక్కదేవి ఐజయ్య పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ఆశించిన ఐజయ్యకు వైసీపీ అధిష్ఠానం షాకిచ్చింది. ఆయనకు టిక్కెట్టు నిరాకరించి ఆయన స్థానంలో రిటైర్డు పోలీసు అధికారి తొగురు ఆర్థర్‌కు సీటు కేటాయించడంతో ఐజయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. దీన్ని అవమానంగా భావిస్తున్న ఆయన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే పార్టీకి చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారని, అటు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగానే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మురళి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  

Kurnool District
nadikotkuru
sitting mla
Telugudesam
  • Loading...

More Telugu News