hardik patel: హర్దిక్ పటేల్ కు పోటీగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. ఆసక్తికరంగా జామ్ నగర్ ఎన్నికలు

  • జామ్ నగర్ నుంచి హార్దిక్ ను బరిలోకి దింపే యోచనలో కాంగ్రెస్
  • అదే స్థానాన్ని ఆశిస్తున్న జడేజా భార్య
  • కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా

గుజరాత్ లో పటిదార్ ఉద్యమ నేత అయిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. జామ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి హార్దిక్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. మరోవైపు, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఇటీవలే బీజేపీలో చేరారు. జామ్ నగర్ సీటును ఆమె ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, జామ్ నగర్ ఎన్నికలు ఆసక్తికరంగా సాగాయి.

గుజరాత్ లో కర్నిసేన మహిళా విభాగానికి రివాబా అధ్యక్షురాలిగా ఉన్నారు. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఆమె బీజేపీలో చేరారు. మరోవైపు, లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను నేడు బీజేపీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

hardik patel
riwaba
Ravindra Jadeja
bjp
congress
jamnagar
  • Loading...

More Telugu News