Prashant Kishore: మీకెందుకు ఓటెయ్యాలి చంద్రబాబు?: ప్రశాంత్ కిషోర్ సూటిప్రశ్న

  • బీహార్ రాజకీయం గురించి ఎందుకు
  • అవమానకరమైన భాషని ఉపయోగించవద్దు
  • మీ దురభిమానం తెలుసు
  • ట్విట్టర్ లో ప్రశాంత్ కిశోర్

తనకు ఓటేయాలని కోరుతున్న నారా చంద్రబాబునాయుడు, తనకు ఎందుకు ఓటు వేయాలో కూడా చెప్పాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఓటమి దగ్గర పడినట్టు తెలుస్తుంటే, ప్రముఖ రాజకీయనాయకులు సైతం ఆందోళనలో ఉంటారు. అందువల్ల నేను చంద్రబాబునాయుడు చేస్తున్న నిరాధార ఆరోపణలపై ఆశ్చర్యపోవడం లేదు. సార్... బీహార్ కు వ్యతిరేకంగా మీ  దురభిమానం మరియు దురభిమానాన్ని చూపించే అవమానకరమైన భాషని ఉపయోగించకుండా, మీకు మళ్లీ ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలన్న విషయంపై దృష్టిని సారించాలని కోరుతున్నా" అని అన్నారు.



  • Error fetching data: Network response was not ok

More Telugu News