priya raman: విశ్వనాథ్ గారి సినిమాలో అవకాశమంటే మాటలా?: సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్

  • బాలుగారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది 
  • గొప్ప కథానాయికలు చేశారు 
  • కమల్ హీరో అనడంతో కథ వినలేదు

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో దాదాపు 60 సినిమాల్లో ప్రియా రామన్ కథానాయికగా నటించారు. పెళ్లి తరువాత సినిమాలను దూరం పెట్టిన ఆమె, ఇటీవల వచ్చిన 'పడి పడి లేచే మనసు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా'కార్యక్రమంలో మాట్లాడుతూ .. "కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేసే ఛాన్స్ రావడమంటే మాటలా? అలాంటిది ఆయన దర్శకత్వంలో 'శుభసంకల్పం'లో ఒక హీరోయిన్ గా చేశాను అన్నారు".

 "జయప్రద .. సుహాసిని .. రాధిక .. విజయశాంతి వంటి గొప్ప కథానాయికలు విశ్వనాథ్ గారి సినిమాల్లో చేశారు. విశ్వనాథ్ గారి కథానాయికగా ఆ జాబితాలో నా పేరు కూడా చేరడం నేను చేసుకున్న అదృష్టం. ఆ సినిమాకి ఎస్పీ బాలు గారు నిర్మాత .. ఆయన ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్లి కలవగానే కమల్ ఆ సినిమాలో హీరో అని చెప్పారు .. అంతే ఇక కథ చెప్పవలసిన అవసరం లేదని అన్నాను. ఎందుకంటే కమల్ సరసన ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకునేదాన్ని. అలా ఆ సినిమా నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.

priya raman
ali
  • Loading...

More Telugu News