: ఎవరెస్టు శిఖరం కరిగిపోతోంది


వేడెక్కుతున్న పర్యావరణం ఎవరెస్టు శిఖరం మీద ఉన్న మంచు గడ్డలను గ్లేసియర్లను కరిగించేస్తున్నట్లు వాతావరణ శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం మీద ఉన్న గ్లేసియర్లు గత యాభయ్యేళ్లలో 13 శాతం మేర కరిగిపోయినట్లు గుర్తించామని వారి అధ్యయనంలో ప్రకటించారు. ఎవరెస్టు పర్వత శ్రేణుల్లో నిత్యం మంచుతో కప్పబడి కనిపిస్తూ ఉన్నటువంటి బండరాళ్లు, సహజ శిథిలాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ మిలాన్‌ శాస్త్రవేత్త సుదీప్‌ ఠాకూరి చెబుతున్నారు.

తమ అనుమానాలకు స్పష్టమైన ఆధారాన్ని చూపలేకపోయినప్పటికీ.. మానవ సమాజంలో ఉత్పన్నం అవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు వంటివి ఎవరెస్టు మీద గ్లేసియర్లు కరుగుతుండడానికి కారణం కావచ్చునని వారు భావిస్తున్నారు. 1960ల తర్వాత ఒక చదరపు కిలోమీటరు వైశాల్యం కంటె తక్కువ ఉండే చిన్న చిన్న గ్లేసియర్లు చాలా త్వరగా అదృశ్యం అయిపోతున్నాయని... వీటిలో 43 శాతం ప్రమాదకరమైన తరుగుదల కనిపిస్తోందని వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News