Mega brother: మెగాబ్రదర్ నాగబాబుపై నిర్మాత ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు.. బాలయ్య ఎవరో తెలియదంటారా? అంటూ ఫైర్

  • ‘మా’ సభ్యుడిగా ఉండి ఆ వ్యాఖ్యలేంటి?
  • మీ వ్యాఖ్యల ఫలితం వరుణ్‌తేజ్‌పై పడే అవకాశం ఉంది
  • మీ విచక్షణకే వదిలేస్తున్నా

బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్న మెగాబ్రదర్ నాగబాబుపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి-బాలకృష్ణ మంచి స్నేహితులని, వారిమధ్య బంధం ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య నాగబాబు వైరం పెంచే వ్యాఖ్యలు కూడవని హితవు పలికారు. నిజానికి నాగబాబుది బాలయ్య స్థాయి కాదన్నారు. బాలయ్య స్థాయితో నాగబాబు సరిపోలరని తేల్చి చెప్పారు.

బాలకృష్ణపై లేనిపోని కామెంట్లు చేస్తున్న నాగబాబు వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నట్టు చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుడిగా ఉన్న నాగబాబు.. బాలయ్య ఎవరో తనకు తెలియదనడం సరికాదన్నారు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. నాగబాబు చేస్తున్న వ్యాఖ్యల వల్ల వరుణ్‌తేజ్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. నాగబాబు ఒకసారి అద్దం ముందు నిల్చుని తాను చేస్తున్నది కరెక్టో, కాదో తనను తాను ప్రశ్నించుకోవాలని ప్రసన్నకుమార్ సూచించారు.  

Mega brother
Nagababu
Chiranjeevi
Balakrishna
Tollywood
Producer Prasanna kumar
  • Loading...

More Telugu News