Lakshmis NTR: 22న కాదు.. 29న.. మళ్లీ మారిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల తేదీ

  • బుధవారం సినిమా స్క్రీనింగ్
  • అభ్యంతరకర సీన్లు, డైలాగులు తొలగించే పని
  • రిలీజ్ డేటు మార్చిన వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల మరోమారు వాయిదా పడింది. ఎన్నికల ముందు సినిమా విడుదలను ఒప్పుకునేది లేదని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ కోర్టు కెళ్తానని ప్రకటించాడు. ఏది ఏమైనా మార్చి 22న సినిమాను విడుదల చేసి తీరుతానని ప్రకటించాడు.

అయితే,  ఆ తర్వాత కాసేపటికే సెన్సార్ బోర్డుతో నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని వర్మ ప్రకటించాడు. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. అయితే, సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ నెల 22న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చిన వర్మ 29న విడుదల చేయాలని నిర్ణయించాడు.  బుధవారం ఈ సినిమా సెన్సార్ స్క్రీనింగ్ అయ్యే అవకాశం ఉంది. అనంతరం అభ్యంతరకరంగా ఉన్న సీన్లు, సంభాషణలు తొలగించి రీ స్క్రీన్ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదంతా ఒక్కరోజులో జరిగే పనికాదు కాబట్టి వచ్చే వారానికి సినిమా విడుదలను వాయిదా వేశాడు.

Lakshmis NTR
Ramgopal varma
Andhra Pradesh
Telugudesam
Release Date
censor board
  • Loading...

More Telugu News