AP: సీపీఐ తొలి జాబితా విడుదల.. ఏపీలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

  • మంగళగిరి నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు
  • విశాఖ (పశ్చిమ) నుంచి జేవీ సత్యనారాయణమూర్తి
  • పాలకొండ (ఎస్టీ) నుంచి డీవీజీ శంకరరావు

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీపీఐ-జనసేన పార్టీతో పొత్తుతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ‘జనసేన’తో పొత్తులో భాగంగా 7 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోన్న సీపీఐ తమ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. ఆరు అసెంబ్లీ స్థానాలకు సీపీఐ అభ్యర్థుల పేర్లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూజివీడు అసెంబ్లీ స్థానంతో పాటు కడప, అనంతపురం లోక్ సభ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను రేపు ప్రకటించనున్నట్టు చెప్పారు.

సీపీఐ ప్రకటించిన ఆరు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల వివరాలు.. మంగళగిరి నియోజకవర్గం నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు, విశాఖపట్టణం (పశ్చిమ) నుంచి జేవీ సత్యనారాయణమూర్తి, పాలకొండ (ఎస్టీ) నుంచి డీవీజీ శంకరరావు, ఎస్.కోట నుంచి పి.కామేశ్వరరావు, కనిగిరి నుంచి ఎంఎల్ నారాయణ, డోన్ నుంచి కె.రామాంజనేయుల పేర్లను ప్రకటించారు.  

AP
CPI
Janasena
assembly
elections
  • Loading...

More Telugu News