Sunnam Rajaiah: ఆసక్తికరం రంపచోడవరం... ఏపీలో బరిలోకి దిగిన ఒకప్పటి తెలంగాణ ఎమ్మెల్యే!

  • భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య
  • సీపీఎం నుంచి రంపచోడవరం బరిలో
  • రాజయ్య, రాజేశ్వరి, ధనలక్ష్మిల మధ్యే ప్రధాన పోరు

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో ఈ దఫా ఆసక్తికరమైన పోరు జరగనుంది. తెలుగుదేశం పార్టీ తరఫున, గతంలో వైసీపీలో గెలిచి పార్టీ ఫిరాయించిన వంతల రాజేశ్వరి, వైసీపీ తరఫున నాగులపల్లి ధనలక్ష్మి బరిలో ఉన్నారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి తెలంగాణ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య బరిలోకి దిగారు. సీపీఎం తరఫున భద్రాచలం మాజీ ఎమ్మెల్యే అయిన రాజయ్య ఇక్కడ పోటీలో ఉన్నారు.

వీరితో పాటు మిగతా పార్టీల నుంచి పలువురు పోటీ పడుతున్నా, ప్రధాన పోరు వీరి మధ్యే జరుగుతుందనడంలో సందేహం లేదు. సున్నం రాజయ్యకు గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవముండగా, అదే తనను గెలిపిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి గెలుపు కోసం రాజేశ్వరి ప్రణాళికలు వేస్తుంటే, వైసీపీ నుంచి ధనలక్ష్మి తొలి విజయం కోసం పావులు కదుపుతున్నారు.

Sunnam Rajaiah
Vantala Rajeshwari
Dhanalakshmi
Rampachodavaram
  • Loading...

More Telugu News