Tamannah: నా కెరీర్ మొదట్లోనే ముద్దు, శృంగారభరిత సన్నివేశాల్లో నటించనని చెప్పేశా: తమన్నా

  • నాకు ఆ క్లారిటీ ఉంది
  • నన్నెవరూ బలవంత పెట్టరు
  • నచ్చకపోతే వద్దని చెప్పొచ్చు

ముద్దు, శృంగారభరిత సన్నివేశాల్లో నటించాలని తనను ఎవరూ ఇబ్బంది పెట్టరని, తాను అలాంటి సన్నివేశాల్లో నటించనని కెరీర్ మొదట్లోనే చెప్పానని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపారు. తాజాగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా పలు విషయాలపై చర్చించింది. ఈ సందర్భంగా ‘నో కిస్సింగ్’ పాలసీ గురించి తమన్నా మాట్లాడుతూ.. ముద్దు, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించాలని తనను ఎవ్వరూ బలవంతపెట్టరని తెలిపింది.

తాను కెరీర్‌ మొదట్లోనే అలాంటి సన్నివేశాల్లో నటించనని చెప్పేశానని, తనకు ఆ క్లారిటీ ఉందని, తననెవరూ బలవంతపెట్టలేరని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఫలానా అభ్యంతకర సన్నివేశంలో నటించాలని ఇబ్బంది పెట్టారన్నా అందులో నిజం ఉండదని మిల్కీ బ్యూటీ తెలిపింది. దీనికి కారణం కూడా చెప్పింది. మనకు తెలియకుండా ఏమీ చేయమని, నచ్చకపోతే వద్దు అని చెప్పి తప్పుకోవచ్చని వివరించింది. ఎవరి నిర్ణయాలు వాళ్లవని తమన్నా తెలిపింది. ఇక పెళ్లి విషయమై మాట్లాడుతూ, ఇప్పట్లో తనకు పెళ్లి ఆలోచనే లేదని చెప్పుకొచ్చింది.

Tamannah
No kissing polocy
Career
Interview
Marriage
  • Loading...

More Telugu News