jana sena: ‘జ‌న‌సేన‌’లోకి మంత్రి గంటా బంధువు

  • గంటా బంధువు, వ్యాపారవేత్త పరుచూరి భాస్కరరావు
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
  • గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన భాస్కరరావు

జ‌న‌సేన‌ పార్టీ లో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు, ప్రముఖ వ్యాపారవేత్త పరుచూరి భాస్కరరావు చేరారు. ఈరోజు సాయంత్రం విజయవాడలోని ‘జనసేన‘ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, గతంలో కాంగ్రెస్ పార్టీలో భాస్కరరావు పనిచేశారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు.

jana sena
Pawan Kalyan
minister
ganta
paruchuri
bhasker rao
Vijayawada
  • Loading...

More Telugu News