Ram Prasad: అభ్యర్థి ప్రకటనతో కృష్ణా జిల్లా పెడన వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి!

  • భగ్గుమన్న అసమ్మతి
  • పెడన టికెట్‌ను ఆశించిన రాంప్రసాద్
  • జోగి రమేశ్‌కు టికెట్ కేటాయింపు

నేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన పూర్తి జాబితాను అధిష్ఠానం ప్రకటించింది. దీంతో టికెట్ వస్తుందని చివరిదాకా ఆశ పెట్టుకున్న నేతల నుంచి అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. కృష్ణా జిల్లా పెడన టికెట్‌ను ఉప్పల రాంప్రసాద్ ఆశించారు కానీ, వైసీపీ అధిష్ఠానం ఆ టికెట్‌ను జోగి రమేశ్‌కు కేటాయించింది.

దీంతో రాంప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుచరులతో రాంప్రసాద్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Ram Prasad
YSRCP
Krishna District
Jogi Ramesh
Pedana Ticket
  • Loading...

More Telugu News