Chandrababu: కాకినాడ సభలో... టీడీపీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

  • దురుద్దేశంతోనే చంద్రబాబుపై ఆరోపణలు
  • ఎలాంటి షరతులు లేకుండా చేరా
  • చంద్రబాబు ఆదేశిస్తే పోటీ చేస్తా

మాజీ ఎంపీ హర్షకుమార్ నేడు కాకినాడలో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసుల విచారణలో న్యాయం జరగకపోతే అప్పుడు సీబీఐ విచారణ కోరాలని సూచించారు.

ఈ హత్యకేసులో దురుద్దేశంతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను టీడీపీలో ఎలాంటి షరతులు లేకుండా చేరానని.. చంద్రబాబు ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే హర్షకుమార్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారైందని ప్రచారం జరుగుతోంది.

Chandrababu
Harsha Kumar
Telugudesam
Amalapuram
Kakinada
  • Loading...

More Telugu News