visakha: నా దగ్గర పని చేసిన కేసీఆర్ కే అంతుంటే, ఇంకా, నాకు ఎంత ఉండాలి?: సీఎం చంద్రబాబు

  • విశాఖకు కేసీఆర్ వచ్చి పూజలు చేస్తాడు
  • మనల్ని మాత్రం తిడతాడు
  • జగన్ కు కేసీఆర్, మోదీ అంటే భయం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలతో విరుచుకుపడ్డారు. విశాఖపట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, విశాఖకు కేసీఆర్ వచ్చి పూజలు చేస్తాడని, మనల్ని మాత్రం తిడతాడని దుయ్యబట్టారు.

‘నా దగ్గర పని చేసిన కేసీఆర్ కే అంతుంటే, ఇంకా, నాకు ఎంత ఉండాలి? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ గురించీ ప్రస్తావించారు. జగన్ కు కేసీఆర్, మోదీ అంటే భయమని విమర్శించారు. ఈ మధ్య ఓటుదొంగలు వచ్చారని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఫారం-7 దరఖాస్తు చేసిన వారిని జైలుకు పంపాలంటూ జగన్ పై పరోక్షవ్యాఖ్యలు చేశారు. జగన్ కు రాజకీయ వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ (పీకే) ఏదైనా చేయాలంటే బీహార్ లో చేసుకోవాలే తప్ప, ఏపీలో ఆయన కుట్రలు పనిచేయవని అన్నారు.

visakha
Telugudesam
Chandrababu
Telangana
TRS
kcr
YSRCP
Jagan
prashanth kishore
bihar
  • Loading...

More Telugu News