Andhra Pradesh: తిరుమలలో 3 నెలల బాలుడి కిడ్నాప్.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు!

  • తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఘటన
  • తల్లిదండ్రులు నిద్రపోతుండగా దారుణం
  • సీసీటీవీలను పరిశీలిస్తున్న అధికారులు

తిరుమలలో కిడ్నాపర్లు మరోసారి రెచ్చిపోయారు. తల్లిదండ్రులతో కలిసి నిద్రపోతున్న మూడు నెలల చిన్నారిని అపహరించుకుని వెళ్లారు. దీంతో బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.

తమిళనాడుకు చెందిన మహవీర్, కౌసల్య దంపతులు తిరుమలలో చిరువ్యాపారం చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరంతా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిద్రపోయేవారు. ఈరోజు ఉదయం భార్యాభర్తలు నిద్రలేవగా, మూడు నెలల చిన్నారి వీరేశ్ కనిపించలేదు. దీంతో ఈ ప్రాంతం చుట్టుపక్కల గాలించిన తల్లిదండ్రులు.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. ఇంతకుముందు 6 నెలల క్రితం ఓ పిల్లాడిని కూడా తిరుమలలో కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. చివరికి బాలుడిని మహారాష్ట్రలో పోలీసులు కాపాడారు.

Andhra Pradesh
Tirumala
kid
kidnap
Police
  • Loading...

More Telugu News