SV Jagan Reddy: టీడీపీకి మరో షాక్... వైసీపీలో చేరిన అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి!

  • వైసీపీలో మరిన్ని చేరికలు
  • కొంతకాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న ఎస్వీ జగన్
  • జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నేత

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, వైసీపీలో చేరికలు మరింత ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి షాకిస్తూ ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. జగన్ రెడ్డి అఖిలప్రియకు స్వయానా మేనమామ. హైదరాబాద్, లోటస్ పాండ్ లో జగన్ నివాసానికి వచ్చిన ఎస్వీ జగన్ రెడ్డి, పార్టీ కండువాను కప్పుకున్నారు.

ఆళ్లగడ్డకు చెందిన జగన్‌, ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీలో చేరికతో ఆళ్లగడ్డలో పార్టీ మరింతగా బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికే ఆళ్లగడ్డలో పేరున్న ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

SV Jagan Reddy
Allagadda
Akhilapriya
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News