KCR: ఇక ప్రచారానికి వెళ్లండి... పది మందికి ఓకే చెప్పేసిన కేసీఆర్!

  • ఆదిలాబాద్ కు గోడం నగేశ్, కరీంనగర్ కు బీ వినోద్
  • మల్కాజిగిరికి నవీన్ రావు పేరు ఖరారు
  • మరో ఆరు నియోజకవర్గాలపై కేసీఆర్ కసరత్తు

మరో మూడు వారాల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాల్సిన వారిని ఖరారు చేసే పనిలో ఉన్న కేసీఆర్, ఇప్పటికే 10 మంది పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం, ఆదిలాబాద్‌ కు గోడం నగేశ్‌, కరీంనగర్‌ కు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, జహీరాబాద్‌ కు భీం రావు బసంత్‌ రావు పాటిల్‌, మెదక్‌ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఎంపిక చేసిన కేసీఆర్, వారిని నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని సూచించారు.

ఇదే సమయంలో భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్‌, వరంగల్‌ నుంచి పసునూరి దయాకర్‌, చేవెళ్లకు జి.రంజిత్‌ రెడ్డి, మల్కాజిగిరికి కె.నవీన్‌ రావు, నాగర్‌ కర్నూల్‌ కు పి.రాములు పేర్లనూ కేసీఆర్ ఖరారు చేశారు. మిగిలిన మహబూబ్‌ నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్‌ స్థానాల విషయంలో టీఆర్ఎస్ అధినేత ఇంకా ఓ స్పష్టతకు రాలేదని సమాచారం.

KCR
Telangana
Lok Sabha
Elections
Candidates
  • Loading...

More Telugu News