YSRCP: హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్!

  • కడపకు బయలుదేరిన వైఎస్ జగన్
  • ఆపై రోడ్డుమార్గాన ఇడుపులపాయకు
  • మధ్యాహ్నం తరువాత విశాఖకు

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బిజీ కానున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటల సమయానికి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు వెళ్లనున్న ఆయన, వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ఆపై పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి, తిరిగి కడప విమానాశ్రయం చేరుకుని, అదే విమానంలో ప్రచారం నిమిత్తం విశాఖపట్నం వెళ్లనున్నారు. వాస్తవానికి నిన్ననే అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ప్రచార పర్వంలోకి వెళ్లిపోవాలని జగన్ భావించినప్పటికీ, ఆయన బాబాయ్ దారుణ హత్యతో అభ్యర్థుల వెల్లడి ఒకరోజు ఆలస్యం అయిందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

YSRCP
Jagan
Flight
Idupulapaya
Andhra Pradesh
  • Loading...

More Telugu News