Sonia Gandhi: వివేకా హత్యపై సోనియా దిగ్భ్రాంతి!

  • సంతాప సందేశాన్ని పంపిన సోనియా
  • ఆయన సేవలు గుర్తుకు వస్తున్నాయి
  • ఆయన విధేయత, వినయశీలం మరచిపోలేను

రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె పంపిన సంతాప సందేశం వివేకా సతీమణి సౌభాగ్యకు చేరింది.

వివేకా మరణంతో ఆయన కుటుంబానికి కలిగిన బాధను తాను అర్థం చేసుకోగలనని, ఆయన మృతికి దారి తీసిన కారణాలు నిష్పక్షపాతంగా జరిపే దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. లోక్ సభలో ఎంపీగా చేసిన సేవలు తనకు ఈ సందర్భంగా గుర్తుకు వచ్చాయని, ఆయన విధేయత, వినయశీలం తాను ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు. వివేకా మృతిపై ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నానని అన్నారు.

Sonia Gandhi
YS Viveka
Murder
Condolence
  • Loading...

More Telugu News