Mahaboob Nagar: భర్త ఉద్యోగం కోసం... ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

  • మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
  • ప్రియుడితో ఏడాది గడిపి ఇంటికి వచ్చిన ఇల్లాలు
  • ఆపై పథకం ప్రకారం హత్య

ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందన్న ఆశ, ప్లాట్ పొందవచ్చన్న కోరిక, ఓ మహిళను కర్కోటకురాలిగా మార్చేశాయి. భర్తను అడ్డుతొలగించుకుంటే, ఉద్యోగంతో పాటు ఇల్లు వస్తుందన్న ఆశతో ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. మహబూబ్ నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళితే, మహబూబ్‌ నగర్‌ మునిసిపల్‌ కార్యాలయంలో పని చేస్తున్న స్వీపర్‌ నర్సింహ (35) భార్య లక్ష్మీదేవికి గత కొంతకాలంగా పూసల శేఖర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధముంది.

భర్తను వదిలేసి ఏడాది క్రితం శేఖర్ తో వెళ్లి పోయిన ఆమె, ఇటీవలే భర్త వద్దకు వచ్చింది. భర్తను చంపేస్తే అతని ఉద్యోగం తనకు వస్తుందన్న ఆశతో ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా శేఖర్, నర్సింహను జడ్చర్ల సమీపంలోని బురెడ్డిపల్లి శివారుకు తీసుకొచ్చి మద్యం తాగించి, ఆపై నర్సింహపై దాడి చేశారు. లక్ష్మీదేవి, శేఖర్ లు నర్సింహ తలపై బీరు సీసాతో బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కేసును నమోదు చేసిన పోలీసులు, తమకు వచ్చిన చిన్న అనుమానంతో విచారణ జరిపించగా, ఈ నిజం వెలుగులోకి వచ్చింది.

Mahaboob Nagar
Murder
Lover
Husbend
  • Loading...

More Telugu News