SV Mohan Reddy: అనుచరులతో ఎస్వీ మోహన్‌రెడ్డి భేటీ.. టిక్కెట్ రాకుంటే ఏం చేయాలన్న దానిపై చర్చ

  • టికెట్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారు
  • వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా
  • రెండో జాబితాలో కచ్చితంగా పేరు ఉంటుంది

టీడీపీ మొదటి జాబితాలో తమ పేర్లు లేని వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ రెండో జాబితాలో తన పేరు లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. నేడు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఆయనకు టికెట్ రాదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, తనకు టికెట్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. టీడీపీ రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని, ఒకవేళ లేకుంటే కనుక కార్యకర్తల నిర్ణయానికి తలవంచుతానన్నారు.

SV Mohan Reddy
Kurnool
Brahmananda Reddy
Telugudesam
Nandyal
Second List
  • Loading...

More Telugu News