YSRCP: వివేకాకు గుండెపోటు వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదే: అవినాష్ రెడ్డి

  • వివేకాది అనుమానాస్పద మృతి అనే చెప్పాం
  • విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారు
  • లేఖ ఎలా వచ్చిందో పోలీసులే తేల్చాలి

వైఎస్ వివేకానందరెడ్డిది సహజమరణం కాదు, అనుమానాస్పద మృతి అని చెప్పామే తప్ప, ఆయన గుండెపోటుతో మరణించాడని తాము ఎక్కడా చెప్పలేదే అని వైసీపీ నేత అవినాష్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వివేక హత్యపై విచారణ చేయకుండా ఏపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వివేక మృతి వార్తను ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డి తనకు చెప్పారని, అప్పటికే కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న విషయాన్ని ప్రస్తావించారు.

వివేక మృతి వార్త గురించి పోలీసులకు సమాచారమిచ్చింది తానేనని, ఆయన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని, శవపంచనామా చేయాలని  పోలీసులను కోరిన విషయాలను గుర్తుచేశారు. తమపై పోలీసులు ఇలాంటి రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నోసార్లు సిట్ వేశారు కానీ, బాధితులకు న్యాయం జరిగిన సందర్భాలు లేవని అన్నారు. ఈ హత్య కేసులో సిట్ ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివేకా మృతదేహం వద్ద తమకు ఎలాంటి లేఖ దొరకలేదని, అసలు, ఈ లేఖ ఎలా వచ్చిందో పోలీసులే తేల్చాలని అన్నారు.

  • Loading...

More Telugu News