YSRCP: వైఎస్ వివేక హత్య కేసు.. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న!

  • సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడటం 
  • చంద్రబాబుకు ఎందుకు భయం?
  • సీబీఐ విచారణకు ఆదేశించకపోతే కోర్టుకు వెళ్తా

వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో సీఎం చంద్రబాబు పాత్ర లేకపోతే, సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఆయన ఎందుకు వెనుకాడుతున్నారని వైసీపీ అధినేత జగన్ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడుతూ, తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? అని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఓట్లను తొలగించడంతో పాటు మనుషులను కూడా తొలగిస్తున్నారంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ‘ఏబీఎన్’ రాధాకృష్ణ ఉన్నారని ఆరోపించారు.

YSRCP
Jagan
Andhra Pradesh
Chandrababu
cm
governer
narasimhan
raj bhavan
cbi
  • Loading...

More Telugu News