Telugudesam: వివేకా ఇంట్లో పనిమనిషి కూడా లేకపోవడం జగన్ రాజకీయాలకు నిదర్శనం: సోమిరెడ్డి ఫైర్

  • సొంత బాబాయినే పట్టించుకోలేదు
  • రాష్ట్రానికి ఏంచేస్తాడు?
  • జగన్ పై ఏపీ మంత్రి మండిపాటు

వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతర పరిణామాలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కడప రౌడీల రాజ్యం పోవాలంటే ఏపీలో మళ్లీ చంద్రబాబునాయుడు నాయకత్వం రావాల్సి ఉందని అన్నారు. సొంత బాబాయ్ అయిన వివేకా ఇంట్లో పనిమనిషి కూడా లేకపోవడం చూస్తుంటే జగన్ రాజకీయం ఏంటో అర్థం చేసుకోవచ్చని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. సొంత చిన్నాన్ననే పట్టించుకోని వ్యక్తి జగన్ అనీ, ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తాడంటే ఎవరూ నమ్మబోరని అన్నారు.

నెల్లూరులో శనివారం టీడీపీ ముఖ్యనేతల సమావేశానికి హాజరైన సోమిరెడ్డి పైవిధంగా వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదాల డబ్బు మనిషని ఆరోపించారు. అక్కడే ఉన్న మరో మంత్రి నారాయణ అందుకుని ఆదాలకు ఎంతో గౌరవం ఇచ్చామని, ఆదాలను ఎన్నోసార్లు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లామని గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News